నాదైన బాటలో అతను

కనుచూపు మేర కనిపిస్తున్న
రహదారిలో నడుస్తున్నాడు..

అది
అతనికి అలవాటు
అయిన దారి
అతని రహదారే..

అయినా
ఎందుకో మరి నాలో
ఎరుపెక్కిన ఆలోచన
ఎగిసిన ఉక్రోషం...

కనిపించే అడుగు జాడలు
చెరిపేస్తూ వెళుతున్నాడని..

నాదైన బాటలో
అతను
అడుగుపెట్టాడని..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!