అద్దంలోని బొమ్మ
జలతారు
సొగసులద్దు కొని
ఎదుట నిలిచింది..
నా ఆలోచనలకు
సవాళ్ళు విసురుతూ....
ఇంటిలోన రంగవల్లులు..
అరచేతిన గోరింటాకు
అద్దింది మక్కువతో....
చిరునవ్వు మాటలతో
ఎదుట నిచ్చింది
మమకారంతో....
మెల్లిగా వెలుగురేఖలు
విచ్చుకుంటున్నాయి
అద్దంలో బొమ్మ
అతను అయ్యాడు....
ఏమీ చేయను...ఇప్పుడు
నాలోని అతన్ని
అతని లోని నన్ను
కలుపుతూ...వేరుచేస్తూ
వెతుక్కుంటున్నా....
Text