నేను ఏమిటో నాకు తెలియదు
నీకు అయినా తెలుసా
మాట్లాడే ముందు
మనసు విప్పే ముందు
నీవు గీసుకున్న బొమ్మకు
సుకుమారపు రంగులు అద్ది
నాది అంటావు
అందమైన ఊహలకు ప్రాణం పోసి
మది నిండుగా నింపుకొని
కవితగా అల్లేసి
నాకు అంకితం అంటావు
ఓయ్ నిజంగా....
నీకు తెలిసిన నేను
నాకు ఎదురైతే
మాట కూడా లేకుండా
మనసు ఇచ్చేయనా...