ద్వేషించే వారితో నాకు పేచీ లేదు
నన్ను గుర్తుంచుకునే మంత్రం తెలుసు...
చిక్కంతా
ప్రేమించే వారితోనే...
చిటికెడంత మాట చిక్కుల్లో వేస్తుంది
మదిని వదిలి వెళ్ళలేక
మౌనంగా ఉంటారు
మనవాళ్లే ...మనసైన వాళ్లే
మృదువైన మనసు మాటలు
దిగుడుబావి నీటి ఊటాయే
వెలితీయ చేద కరువాయే
ఏమి చేయను...
తేనెలొలుకు మాటలు
నాకు అంతు చిక్కలేదేమో
నా జ్ఞాపకం లోని నీ రూపులా....