ఓ జ్ఞాపకాల బంధీ...
నా అలల సంద్రంమా....
ఎగిసి పడే అలలకు ఆనకట్ట ఎందుకు...
నా నుంచి నువ్వు తప్ప కోవాలని ఆరాటం ఎందుకు...
మౌనాన్ని మల్లెపూలచెండు చేసి అందిస్తావెందుకు..
నా నుంచి నువ్వు కదిలిపోతే
నీలోని నేను మసకబారనా....
నా ఆనవాలు సంద్రపు ఆల్చిప్పయై
మాటతో అవసరంలేని మౌన వీణనవనా
జ్ఞాని మెచ్చే మౌనం
బహుమతియై వస్తుంటే...కాదనలేను
మౌనినై నీకోసం వేచి ఉండలేను...
నీకు తెలిసిన ఈ నిజాన్ని ఎక్కడో
అపద్దపు పుటలో మరుగు పరచావెందుకో
ఆకాశంలో నీటి రాతలు రాస్తావెందుకు...