నీకు నాకు మధ్య
బంధుత్వం లేదు
అయినా గుర్తుకొస్తావు
కలవని దూరంలో ఉన్నావు
అయినా గుర్తుకొస్తావు
చెప్పకుండా తప్పుకుపోతావు
అయినా గుర్తుకొస్తావు
ఎందుకని ....
ఆకాశంలోని
నిండు చందమామలా ఓసారి
నెలవంకలా ఓసారి
గుర్తుకు వస్తూనే ఉంటావు
బహుశా
దూరంలోనే దగ్గరితనం
బంధుత్వం లేనిచోట బంధం
పెనవేసుకుంది కాబోలు...