అతడు ధ్యానంలో మౌనంగా ఉన్నాడు
తెలిసి కూడా పదే పదే ఆ చోటుకు వెలుతూనే ఉన్నాను..
ఏమో ఏ క్షణమైనా నాది కావొచ్చని కాబోలు...
కాలం నడకలో
పువ్వు పూసింది మొక్క నవ్వింది ..
బండరాయి సైతం మాటలు నేర్చుకుంది ......
ఏమి జరగని చోట ఏ ఆనవాళ్లు లేని చోట ఎలా వచ్చి చేరాయో
ఈ చిరుగాలి లాంటి జ్ఞాపకాలు...
మల్లె పందిరి తీగలా అల్లుకుపోయి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉన్నాయి...
అతడు ఇంకా అక్కడే ధ్యానంలోనే ఉన్నాడు... మౌనంగానే ఉన్నాడు...
పదే పదే వెళ్లి.... నా కొన్ని క్షణాలు ఇద్దామన్న తలపు.....
కానీ అది కూడా కాలం మలుపులో ఆగిపోయింది ...
బహుశా ఇప్పుడు నేను మోక్షగామి నయ్యాను కాబోలు...