చీకటిని బంధించిన రహదారి ఇరువైపుల
అంచుకు మరీ మరీ ఒదిగిన జరిగిన చెట్లు..
ఏమో తన నడకకు అడ్డు అని..
మనిషి తనకు ఎక్కడ ముప్పు తెస్తాడో
అని బెంగ పడి కాబోలు .....
.
అయినా ఎందుకో మనిషితో మాట్లాడడం మానలేదు..
తనకు కనిపించినంత మేరా ఎవరికీ అంతుచిక్కని
కథలు చెబుతానంటూ... ఆకుల గలగలతో పిలుస్తున్నాయి......
మిత్రమా... ఒకసారి చూడు నీ మనసెందుకో మసకబారి పోయింది.....
తన కళ్ళు ఎందుకు పొడిబారి పోయాయి...
నా నీడ ఎందుకు దారి తప్పి పోయింది...
బహుశా దాచిన జ్ఞాపకాలు ఇక్కడ కథలుగా మిగిలాయి ఏమో...
ఒక్కసారి అడుగులు అటువైపు వేయరాదు..