అయ్యో అతనికి అడగడం రాదు...
కనుచూపు మేర మంచులో స్నానమాడిన
పచ్చని తివాసి పరచిపెట్టు...
కోకిల గానాన్ని చెవికింపుగా చేరనివ్వు..
వాగు వంకలు అతనికి జతగాళ్లుగా అందివ్వు..
అతని మేనుకి పారిజాతాలు సోయగాన్ని అందివ్వు..
మది.. మస్తిష్కంను పరవశపు చిగుర్లతో నింపివ్వు,.
చివరాఖరుగా ఓ విషయం మాత్రం మర్చిపోకు...
అన్నిటిలో నా ఆస్తిత్వం పెనవేసిపెట్టు..
నా ఆనవాలు మాత్రం దాచిపెట్టు...