అతణ్ణి నిదురపుచ్చమన్నాను
పాల నురుగు లాంటి మాటలు
ఉగ్గు గిన్నెలో పోసి అందించాడు
ఆకలితో ఉన్నావు కాబోలు అంటూ
మాటకు ఓ మాట అల్లుకుంటూ
నాలుగు మాటలు వేల మాటలై
వీధి నంతా చుట్టుకుని
జోలపాటై నిదురపుచ్చింది
ఎందుకో
వేకువఝామున
ఉలిక్కిపడిన నిదురకు
మనసు రగల్చిన
అశ్రుధార కడలి నందు
పాల నురుగుల
మాటల
ఆనవాలు చిక్కె..