గల గల పారే సెలయేరు
ఊరు మెచ్చిన యేరు
ప్రేమింపబడింది....
ఆనందంతో ఉరకలు వేసింది
నేను ప్రేమలో ఉన్నాను అంటూ
ఎలుగెత్తి అరిచింది...
ఎలా మొదలైందో..
యేరు నెమ్మది అయ్యింది
హోరు లయ తప్పింది
ఎందుకో మౌనం అందుకుంది
తనలోకి తాను ఒదిగి పోయింది
వారు వీరు అన్నారు ఒకప్పుడు
ఇక్కడ సెలయేరు ఉండేదని
సెలయేరు కళ్ళు
సముద్రాలయ్యాయి
హోరెత్తి పొంగింది
నేనున్నానంటూ
ఎలుగెత్తి అరిచింది
అన్ని ఇప్పుడు
గుసగుసలే
తనలో తాను..
అందరూ మెచ్చిన యేరు
ఏమయ్యిందో కానీ ...
సెలయేరు ప్రేమింపబడింది
ప్రేమింపబడుతూనే ఉంది
బహుశా
సొగసైన సెలయేరు
మా ఊరి ఆడపడుచే కాబోలు...