ప్రేమను తూకం వేయడం
ఎక్కడ నేర్చుకున్నావ్
నాతో నడిచిన అడుగు చెబుతుందా
గడిచిన గతం చెబుతుందా
నీవు వినే మాట చెబుతుందా
నేను అనే మాట చెబుతుందా
నీ ఊహ చెబుతుందా
నా భావం చెపుతుందా
మరులుగొన్న మది చెబుతుందా
మరిచి పొమ్మనే మధువు చెబుతుందా
ఏది చెపుతుంది...
ప్రేమలోని నాణ్యతను
ప్రేమను పంచడం కష్టం
బంధించడం మరింత కష్టం
...........
తూకం వేయడం అంటే
నీకు నువ్వు ఖరీదు కట్టుకోవడమే