ఓ సాయం సంధ్యలో
నిజాన్ని.. అబద్ధాన్ని
గాలిలోకి విసిరేశా ....
క్షణం తిరక్కుండా
అబద్ధం
వంద మంది స్నేహితులతో
గదిలో వచ్చి చేరింది...
గంట తిరక్కుండా
నిజం
వెయ్యిమంది శత్రువులతో
ముంగిట నిలిచింది...
మెల్లిగా బయటకు అడిగేసా
శత్రువుల నుండే
మిత్రులను ఎన్నుకుందాం అని...