జ్ఞాపకాలన్నీ మా వీధి వాకిట
చేరి ముచ్చట్లాడుతున్నాయి...
కనుమరుగైన జ్ఞాపకం ఒకటి
అనుకోని అతిథిలా ఎదురైంది
అంతే.....ఇంకేముంది
జ్ఞాపకాలన్నీ
రంగు వేసిన బొమ్మల్లే మెరిసి
కమ్మని కథలా సందడి చేసాయి...
అందమైన జ్ఞాపకంలా..
అచ్చంగా నీలాగా....