మనిషి మంచోడు ఎలా అవుతాడు
నిన్ను నొప్పించి .. నన్ను నమ్మించి ..
కొందరిని మెప్పించి..ఎందరినో ఒప్పించి..
మనిషి మంచోడు ఎలా అవుతాడు
మంచోడు ఎప్పటికి అవుతాడు
అక్కడ
పెద్ద పోటీనే జరుగుతుంది
ముక్కోటి దేవతల మధ్య ఎప్పటినుండో
అందరినీ మెప్పించి...ఒప్పించడం కోసం..
అంతంలేని పోటీలో
మనిషి మంచోడు ఎలా అవుతాడు
మంచోడు ఎప్పటికి అవుతాడు