చేదు జ్ఞాపకాల కి ఆపేక్ష ఎక్కువ
కనుచూపు మేరలో కనిపెట్టుకొని ఉంటుంది ..
చెదిరిన జ్ఞాపకానికి ఓపిక ఎక్కువ
కడ వరకు వెన్నంటే ఉంటుంది ...
చేజారిన జ్ఞాపకానికి అనుకువ ఎక్కువ
ఆనవాలు పట్టుకొని చెంత చేరి పోతుంది..
ఏది ఏమైనా.....
వదిలేసిన జ్ఞాపకాలకి బంధుప్రీతి ఎక్కువ
అన్నిటినీ (జ్ఞాపకాలను) కలుపుకొని..
నీ పొడవాటి నీడలోనే ఒదిగి
సాగుతుంది జీవిత చరమాంకం వరకు..