ప్రపంచమంతా నిశ్శబ్దమయినప్పుడు...
నా గుండెచప్పుడు మాత్రమే వినిపిస్తుంటుంది.
...నీకు నేనున్నానని చెబుతూ ఉంటుంది...
గర్వంగా బ్రతకడానికి ఇంతకన్నా
ధైర్యమేముంటుంది...?
-నరేన్
ఒక నాడు చిమ్మ చీకటిన నేను సూన్యంలోకి చూస్తుంటే
ఆ చీకటి సూన్యానికి తోడై మనసుని లోకి చొరబడుతుంటే
కనుల నిండా కష్ట కాలాలే, గుండె నిండా చేదు భావాలే...
కన్నీరుకు భయం పుట్టి కంటి పాపను దాటకుంటే,
దూరంగా ఒక్క వెలుగు అలుపెరుగని ధైర్యంతో అంధకారాన్ని చీల్చుతుంటే,..
కట్టలు తెగిన ధైర్యం నాలో, అదేంటని తెలుసుకుంటే,
ఒక చిన్న మిణుగురు, దిక్కులు దాటిన ఆ నిశి తో పోరాడుతుంటే ,
ప్రపంచాన్ని జయించిన ఒక వీరుడు కనిపిస్తాడు, చరిత్ర చూసుకుంటే,
ఇంతకు మించిన మనో స్థైర్యం ఎవరిస్తారు, మిణుగురు కంటే,...
- నరేన్