అష్టపది

అమ్మో! అది అందాల మరదలుపిల్ల..
శ్రీశ్రీ కవిత్వంలా అంతేచిక్కదు....
అందుకోడానికి ధైర్యం చాలదు
ఒదులుకోడానికి మనసే ఒప్పదు...
అవును...కాదు అంటూ ఆరుమాసాలు గడిచే....
ఒకనాడు...
సీసపద్యం నీవంది.. ఆటవెలది నేనంది
నీ వెనకే నా అడుగంటూ...
రామదాసు కీర్తనల్లె రమ్యంగా వచ్చింది....
అన్నమయ్య పదంలాగా నన్నల్లుకుపోయింది....
త్యాగరాజు కృతివోలె శృతి చేసి వెళ్ళింది....
అమ్మో అమ్మమ్మో...ఈ గడసరిపిల్ల
అంతేచిక్కని ఆడపిల్లా..
జయదేవుని అష్టపదిరా తస్సాదియ్యా...
వదిలి ఉండలేను  యిక క్షణమైన ...
ఆషాడం ఐతే కాని.. ముహూర్తం పెట్టమని
మామ ఇల్లుచేరా ఆగలేక... తనను చూడకుండా ఉండలేక....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!