కవ్వించకే నన్నిక ....

1.
పాత నాణేనికి విలువెక్కువ
చెదిరిన జ్ఞాపకానికి కన్నీళ్ళెక్కువ..
దాచిన జ్ఞాపకానికి కలత లెక్కువ


2.
గబ్బిలం లాంటి ఓ గడుగ్గాయి జ్ఞాపకం
నన్ను  వదిలి ఆకాశం వైపు చూస్తుంది..
తన అవసరం దేవుడికి మాత్రమే ఉన్నట్టు..

3.
చీకటి గదిలోని ఓ  జ్ఞాపకం
స్వేచ్ఛకై పరితపించే.....
ఓ అందాల  జ్ఞాపకం
చికటినే మిత్రునిగా చేసుకొని
మరణించే....

4.
జ్ఞాపకాలన్నీ కన్నీటి సముద్ర స్నానానికి
వచ్చాయి ....ఏమో...మరి...
ఏ నది పుస్కరాలో ఈ ఏడు..

 


Comments

Post New Comment


venkat 08th Oct 2012 02:57:AM

Na hrudayamane kovelalo tane pratime pettukunna, tana puttina aa nelalo tala valshukuni vechiunna, tanani kalisina velalo matalu raka nilchunna, premani telipe margame teliyaka tirugutunna.