ఒక ప్రేమ కధ...
ఒక అందం కనిపించింది,
నవ్వుతూ పలకరించింది
మాటలాడుతూ తేనె చిలకరించింది,
తను పాడితే మది మైమరచిపోయింది,
మనసంతా గంధాలతో నిండిపోయింది,
మది పదే పదే తననే తలుస్తోంది,
అనుకోని ఒక రోజు తన ప్రేమను తెలిపింది,
అంత అందం సొంతమైతే ఇంకేముంది?
ఈ కధలో కొత్తేముంది?
నా హృదయాన్ని తెంచి ఇమ్మంది,
పిచ్చి మనసు పాపం తెలియక ఇచ్చేసింది,
ఒక నాడు గాయాలతో హృదయం తిరిగి వచ్చింది,
ఇన్నాళ్ళూ తనకెందుకు చెప్పలేదని మనసు ప్రశ్నించింది,
హృదయం తనలో ఆ రూపాన్ని చూపి కన్ను మూసింది,
మనసు కన్నీటి సంద్రంలో ఒంటరిగా సంచరిస్తోంది...
మరొక అందం కనిపించింది,
నవ్వుతూ పలకరించింది ,
మనసు భయంతో వణికిపోతుంది...
-నరేన్