1. ప్రేమలో పడితే
కంట్లో వెలుగు
పెళ్లిలో ఓడితే
మదిలో కన్నీరు
2. ప్రేమకై రగులుతుంది
స్త్రీ హృదయం
అందకుంటే పగులుతుంది
నీ హృదయం
3. ఆకాశంలో చందమామ
అద్దంలో నువ్వు
రెండు కంటి కెదురే
అందనంత దూరంలో
4. ర్యాంకు మైనస్
నిల్ బ్యాలెన్స్
హార్ట్ బ్రేక్ అంటూ
డ్రింకు పై డ్రింకు
5. అమ్మాయిల హోరు
కుర్రకారు జోరు
రోడ్డుపై గోల
పోలీసు ఈల
6. గుడిలోని పూజ (చేస్తే)
పూజారయ్య పాయసం
బడిలోని పూజ (చూస్తె)
పంతులయ్య తొడపాశం
......రమా