నా నెచ్చెలి మేని అపురూపం,
నా సఖి పాదాలు సుతారం,
నా ప్రేయసి పలుకులు ముత్యాల హారం,
నా ప్రియురాలు నిద్రించు సుకుమారం,
నిన్ను సున్నితంగా మేల్కొల్పమని నేను ప్రకృతికి చేసిన విన్నపం,
గంధపు గాలులతో నిన్ను ముంచుతుందో,
పూల జల్లులలో నిన్ను తడుపుతుందో,
అని వేచి చూస్తున్న నా మనసు కలవరం,
-నరేన్