తాత దగ్గంటాడు..
నేత ఓటంటాడు..
బాబు పాలంటాడు..
నేను మాత్రం కావాలి..
నువ్వంటాను...!
నీ నవ్వంటాను.....!!
....ఉష..
పలికితే నేను సత్యం..
ఫక్కుమని పళ్ళికిలిస్తోంది..
లోకం ప్రతి నిత్యం..!
ఇది అక్షర సత్యం..!!
....ఉష..
నీ నవ్వు జాజిపువ్వు
గురి చూసి ఎదకు విసిరేస్తే నువ్వు..
అలిగి ముడిచిన పెదవులపై..
పకపకా వచ్చింది నవ్వు..!!
....ఉష..