కనపడని మానసా
కనిపెట్టని మనసా,
తనవున ఉండి అణువణువును శాసిస్తూ
ఆశయాలకు జన్మనిస్తూ,ఆశలను జీవింపచేసే,
రూపం లేని మనసా,
రూపాన్ని అపురూపంగా మార్చే మనసా.
ఆరాటం ని వయసు
పోరాటం నీకే తెలుసు
అందని జాబిలీ వెన్నెలతో
దాహం తీరని ఆశలతో
పొడచిన పొద్దు వాలక ముందే
పూచినా పువ్వు వాడక ముందే
రంగుల రవళివై విహరిస్తావు
సంద్రము అలలతో స్నానాలు చేస్తావు,
అంతుచిక్కని మనసా ,
అంతుతోచని మనసా,
తీరం నీదే దూరం నీదే,
పయనం నీదే పరుగు నీదే,
పండని కోరికలతో
పదనిసలు లేని
కళల సామ్రాజ్యాన
మువ్వలు లేని సవ్వడితో నర్తిస్తావు,
కనపడని మానసా,
కనిపెట్టని మనసా.
--సంపత్ కుమార్..