ప్రేమ - విజయం - సంపద (అమ్మ..నాన్న..ఓ జీనియస్ ..వేణుభగవాన్ )

ప్రేమకు పెద్ద పీఠం వేసారు అమ్మ.. నాన్న ఓ జీనియస్  పుస్తకంలో వేణు గారు ..పెద్దలకు ఎపుడు తమ పిల్లలు తాము చెప్పింది వినాలి అనే పట్టుదల ఎక్కువ.. ఆ పట్టుదల వల్ల .. ప్రేమతో కట్టిపదడేయవచ్చు పిల్లలను అన్నది మర్చిపోతున్నారు తల్లి తండ్రులు..ప్రేమ అన్నది హృదయం నుండి జీవించినప్పుడు వ్యక్తికి సహజంగా ఉండేది. జీవన కేంద్రం మనస్సు  (మైండు) కాక హృదయం అయినప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది. ప్రేమ తత్వమే వ్యక్తి తత్వమైతే, ధైర్యమూ వస్తుంది. అంటారు వేణు భగవాన్ గారు..


ప్రేమ - విజయం - సంపద (అమ్మ..నాన్న..ఓ జీనియస్ ..వేణుభగవాన్ )


పూర్వం చైనాలో ప్రతీ ఇంటికీ ఒక తోట ఉండేది. అలా ఒక కుటుంబం అలాంటి ఇంటిలో ఉంటుంది. ఆ సమయంలో ఈ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులలో ఉండి. భర్త కెరియర్ ఆశాజనకంగా లేదు. దానివల్ల కుటుంబంలో వాదోపవాదనలు, ఘర్షణ నిత్యకృత్యమైంది.

ఆ ఇంటికి ఒకనాడు ముగ్గురు అతిథులు వచ్చారు వారు ఆ తోటకు ఒక మూలంగా కూర్చొని ఉన్నారు. భర్త కోసం ఎదురుచూస్తూ తోటలోకి వచ్చిన భార్య ఈ ముగ్గురు వృద్ధులనూ చూసింది. వారి వైపు నడుస్తూ పొడుగాటి తెల్లగడ్డాలు ఉన్న వారి కళ్ళల్లో కనపడే దివ్యకాంటిని బట్టి వారు మహా ఉప్రుష్య్లని గుర్తించింది. వారితో 'మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు ఆకలితో ఉన్నట్లు కనపడుతున్నారు, మా ఇంటిలోకి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని ఆహ్వానించింది.

దానికి వారు, 'మీ ఇంటాయన' ఇంటిలో ఉన్నాడా అనడిగాడు.
దానీ ఆవిడ 'లేదు' అని సమాదానమివ్వగానే,ఇంటాయన ఇంటిలో లేనప్పుడు, మేము మీ ఇంటిలోకి రాలేము అని వారు చెప్పారు.
ఇంతలో భర్త రానే వచ్చాడు. ఎప్పటిలాగే కొంత టెన్షన్ తో ఉన్న భర్తకు, భార్య ఈ అతిథులగురించి చెప్పింది. ఆయనకు ఇష్టం లేకపోయినా, భార్య ఒప్పించడంతో, వారిని ఇంట్లోకి ఆహ్వానించమన్నాడు. భార్య వెళ్లి, వారిని లోపలికి రమ్మని ఆహ్వానించింది.

వారు 'మేము ముగ్గురం కలసి ఒకేసారి ఇంట్లోకి రాము' అని చెప్పారు.
'ఎందుకు అలా ' భార్య అడిగింది.
అందులో ఒకరు వివరించి చెప్పారు. ఇతని పేరు సంపద (wealth), మరొకరిని చూపిస్తూ ఇతని పేరు విజయం (success), నా పేరు ప్రేమ (love). మాలో ఎవరో ఒకరే వస్తారు. ఎవరురావాలో నిర్ణయించుకోండి అని చెప్పాడు.

భార్య కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం చూసి వారు మీ భర్తతో సంప్రదించి, మాలో ఎవరు  రావాలో తెలుపమని కోరారు. భార్య వచ్చి భర్తతో వారు చెప్పిన విషయం చెప్పింది.

భర్త ఆనందపడ్డాడు. ఎంత అదృష్టం మనం 'సక్సెస్ ను ' పిలుద్దాం. ఆతను నన్ను విజేతను చేస్తాడు. ఇంక నా కెరీర్ లో అన్నీవిజయాలే. నా సమస్యలన్నీ తీరిపోతాయి అన్నాడు. భార్య ఒప్పుకోలేదు, మనం 'సంపదను' పిలుద్దాం. 'డబ్బు ఉంటె అసలు మీరు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు'అంది. ఈ సంభాషణ అంటా మౌనంగా వింటున్న కూతురు, "ముందు మనం 'ప్రేమను' ఆహ్వానిద్దాం. ప్రస్తుతం మన ఇంటిలో లేనిది, అవసరమైనది అదే అని చెప్పింది". ముందు నచ్చక పోయినా, కూతురు పట్టుబట్టడంతో, సరే, వెళ్లి ఆ 'ప్రేమను 'పిలుచుకురా అని భార్యకు చెప్పాడు.

భార్య, మేము 'ప్రేమ' ను మా ఇంటికి ఆహ్వానించదలిచాము అని చెప్పగానే, 'ప్రేమ' లేచి ఇంటిలోకి వస్తుంటే భార్య ముందు నడుస్తుంది. అలా 'ప్రేమ' ఇంటిలో ప్రవేశించగానే 'విజయం', 'సంపద' కూడా వెనకాలే వచ్చేసారు.మీలో ఒక్కరే వస్తానన్నారు కదా అని భార్య అడిగింది.
దానికి వారు, 'విజయం'. 'సంపద' లో ఎవరిని పిలిచినా ఒంటరిగానే వస్తాము. కానీ 'ప్రేమను' ఆహ్వనిస్తే మాత్రం అందరం కలిసి వస్తాము. ప్రేమ ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము అన్నారు.


ప్రేమ అన్నది హృదయం నుండి జీవించినప్పుడు వ్యక్తికి సహజంగా ఉండేది. జీవన కేంద్రం మనస్సు  (మైండు) కాక హృదయం అయినప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది. ప్రేమ తత్వమే వ్యక్తి తత్వమైతే, ధైర్యమూ వస్తుంది. విజయమూ వస్తుంది. ఐశ్వర్యమూ వస్తుంది. మీరు మీ పిల్లలను షరతుల్లేకుండా ప్రేమించడం మొదలు పెట్టండి. వారు మీరు ఆశించిన దానికంటే అత్యున్నతంగా ఎదుగుతారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ప్రపంచంలో రొట్టె కోసం ఆకలి ఉందొ లేదో తెలియదు కానీ ప్రేమకు మాత్రం చాలా ఆకలి ఉంది అన్నారు మథర్ థెరిస్సా, ౦+౦+౦+౦+...ఇలా ఎన్ని సున్నాలు కలిపినా సున్నాయే అవుతుంది. కానీ ముందు 1 చేరిస్తే అన్నీసున్నాలకు విలువచేకూరుతుంది. అల్లాగే ప్రేమతో చేసదేదైనా అర్ధవంతమైనది అవుతుంది. "ప్రేమ వికసించడమే ధ్యానం"అంటారు జిడ్డు కృష్ణమూర్తి.

పిల్లలు భాద్యతగల పౌరులుగా తయారవుతున్నారా లేదా అన్నది బట్టలు సరిగ్గా తగిలిచారా, మాసిన దుస్తులు బుట్టలో వేసారా అన్నది పెద్ద విషయం కాదు. కానీ వారు వారిగురించీ, ఇతరుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారా - రోజువారి పనుల్లో ఈ భూమిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో స్పృహ ఉందా అన్నది ముఖ్యం.
........ఎడా లేషన్ , పిల్లల పుస్తక రచయిత
కొత్త అవతార్

ఒక ఖాళీగా ఉన్న బోర్డుపై ఏదయినా రాయవచ్చు. అప్పటికే రాసినదానిపై రాయడం వల్ల ఏది రాయదానికైనా ఒక సంభవంలాగా ఉంటుంది. అలాగే ఏ అభిప్రాయాలు, అపరాద భావనలనే బరువులు లేనిచోట సహజంగా హుషారుగా ఉంటారు.
ఒక ఆశ్రమంలో ఒక ఎలుక ఇబ్బంది పెడుతుండట. దీనిని పట్టుకోవడానికి ఒక పిల్లిని తెచ్చారు. ఆ పిల్లి ఎన్ని ఎత్తులు వేసినా ఎలుక దొరకట్లేదు. ఈ ఎలకను పట్టుకోవడానికి ఆ ఊరిలో ఉన్న పిల్లులన్నీ ప్రయత్నించినప్పటికీ దొరకలేదు. అప్పుడు ఆ పిల్లులన్నీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసుకొని, ఒక్క ఎలుకను పట్టుకోలేకపోవడం తమ జాతికే అవమానమని ముక్తకంఠంతో ఘోషించి,తమ గురువైన భీష్మ పితామహా లాంటి వృద్ద పిల్లి సహాయం తీసుకోవాలని తీర్మానం చేసుకున్నాయి. ఆ వృద్ద పిల్లి వచ్చి తన అతిథి గృహంలో ధ్యానం చేసుకుని, ఆ ఇంటిలోనికి వెళ్లి ఆ ఎలుకను పట్టుకోచ్చేసిందట. మిగతా పిల్లులన్నీ సంబ్రమాశ్చర్యాలకు లోనయి, "గురూజీ మీరు ఏం టెక్నిక్ ప్రయోగించారు ఈ ఎలుకను పట్టుకోవడానికి, మేము ఎన్ని ఎత్తులేసినాను దొరకలేదని" వాపోయాయట. దానికి ఆ వృద్ద పిల్లి 'ఓసి పిచ్చి (తల్లుల్లారా) పిల్లుల్లారా,  మీరు ఏ కాలంలో ఉన్నారు? ఈ తరం సమాచార యుగం. ఎలా మననుండి తప్పించుకోవాలో దానికి తెలిసిపోయి, మీరు ఆ ఎత్తు వేయకముందే దానికి ఫై ఎత్తుతో మిమ్మల్ని చిత్తుచేస్తుంది. అందుకే నేను ఏ ఎత్తులూ లేకుండా ధ్యానం చేసుకుని ఖాళీ మనస్సుతో వెళ్లాను. అది నా వైపే చూస్తుంది, పట్టుకుని వచ్చేసాను" అందట.

అలాగే పిల్లల విషయంలో పెద్ద పెద్ద ప్లాన్లు వేయకండి. ప్రేమ హృదయంతో సాకండి. ఏదైనా ఒక వ్యాపారస్తుడు లోపల ఒక రహస్య కార్యక్రమము (అజెండా) పెట్టుకుని, పైకి మరో విధంగా ప్రవర్తించినట్లయితే, వివేకం ఉన్న ఎవరికైనా ఎలా అర్థమయిపోతుందో, అలా మన మనసులో భావాలూ పసిగట్టగల వివేకవంతులు పిల్లలు. మనం అవతలి రోడ్డుకు వెళ్ళాల్సినప్పుడు, ఎదురుగా వస్తున్న ట్రాఫిక్ ఆగాక దాటుదాం అనుకుంటే దాటడం చాల కష్టం అయిపోవచ్చు. అదే, ముందుగా ఆ ట్రాఫిక్ తో పాటు ప్రయాణించి రోడ్ డివైడర్ వద్దకు చేరుకొని 'U' మలుపు తీసుకుని మన దారిన మనం వెళతాం. అదే విధంగా ముందు పిల్లల పక్షాన ఉండి, వారికి మీరు మంచి స్నేహితులు, శ్రేయోభిలాషులు అనే విశ్వాసం కలిగించాలి. అప్పుడు వారు మీతో అన్ని కీలక విషయాలు పంచుకోగలుగుతారు. అప్పుడు మీరు వారికి ఒక లైఫ్ కోచ్ లా సహాయపడగలుగుతారు.
పిల్లలను గొప్ప మన్వమత్రులుగా తీర్చిదిద్దడం కంటే గొప్ప పనేముంటుంది జీవితంలో.
ఈ రోజు పిల్లలు సమాజంలో ఒక భాగం. కానీ రేపటి పూర్తి ప్రపంచం వారే.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!