రాతిరికెందుకో అంత కర్కశత్వం
ఊహలకు రంగులద్దనివ్వక
చిక్కటి చీకటి వల అల్లుతుంది
కన్నులకెందుకో అంత పంతము
కలలు రాకుండా కాపలా కాస్తూ
పగటి నిద్దుర అరువు తెచ్చుకుంది
మది ఎందుకో అంతటి అలసట
మాటైనా దరి చేరనీక
గరుకు దుప్పటి ఒకటి కప్పుకుంది
ఇక
నావల్ల కాదు
సర్ది చెప్పడం... సరి చేయడం
ఓయ్
ఇప్పుడైనా రారాదూ
వచ్చి..... ఏమార్చి ఎత్తుకుపోరాదూ