ఎవరన్నారు
అన్ని బంధాలు అపురూపమని
కొన్ని బంధాలు పెనవేస్తే
కొన్ని బంధాలు నులిమేస్తాయ్
అదేమి చిత్రమో
పనవేసే బంధాలపై ఎంత అలుసో
చిరాకులు పరాకులు అలవోకగా విసిరేస్తాం
ఇది మరీ విచిత్రం
నులిమేసే బంధాలపై మక్కువ
రక్త సంబంధాలన్న సాకు ఉంటే మరింత ఎక్కువే
తల తిక్క వాదనలు చేసే మనిషి
చెబితే మాత్రం వింటాడా
రక్తపు గాఢత ఎక్కువ అంటాడు
అయిన వాళ్లపై మక్కువ అంటాడు
అయిన వాళ్లంతా వెన్నువిరిచి వెళ్లినా
ద్వేషం అంటూనే కథలు కథలుగా
వారి గురించే చెపుతూనే
చస్తే మావాడేనంటూ పరిగెత్తుకు వెళ్తారు
వదిలేసిన బంధాలు కూడేసుకుని వస్తారు
ఇప్పుడు అప్పుడు ఎప్పటికీ....
పెనవేసుకున్న బంధాల్లో
ఎందుకో వారంతా పరాయివారే
అగ్గువకి దొరికినట్టు ఏరేస్తారు...