సమయాన్నంతా
నాలుగు భాగాలు చేసి నీకొకటి నాకొకటి
మన కోసం మరో రెండు అంటూ పంచినప్పుడు అంతా
సవ్యంగా ఉన్నట్టే ఉంటుంది...
ఎప్పుడు
అంతా నీవుగా అయిపోతావో
సమయపు తిక్క లెక్కలు ఎంతకీ తేలడంలేదు
ఓయ్
నాకు లాగానే
సమయం కూడా ... నీకు బందీనేనా