ఇలాంటి ఒకరు ఉన్నారా...
వాళ్ల చుట్టూ ఎప్పుడూ మాటలే.... పనిలో కూరుకుపోయి చేసేంత పనులేముంటాయి అనేవాడు. పోసుకోలు కబుర్లు చెప్పేవాడు ...పనిమాల పని కల్పించుకొని మాట్లాడేవాడు. వాడు చెప్పేది చెప్పేసి నువ్వు వేసే విసుర్లు పట్టించుకోనివాడు..
అలాంటివాడు ఏదో ఒక రోజు నిన్ను కబుర్లు ఏంటి అని అడిగాడు అంటే వాడికి నాలుగు మాటలు కావాలని వాడు చెప్పిన పోసుకోలు కబుర్లు కాస్తయినా తిరిగి పంచమని అర్థం...
నువ్వు వాడిని ఏంటి ఈ మధ్య కబుర్లని వెతుక్కుని పలకరించావంటే అంటే నీకు మాట్లాడే వాళ్లే కరువయ్యారని వాడి మాటలు నీకు ఔషధం అని అర్థం. మాట్లాడిన కాసేపట్లో నిన్ను నీకు పరిచయం చేస్తాడు నీ అంత మంచోళ్ళు కాదురా బాబు అందరూ అంటూ...
అక్కడో ఇక్కడో ఎక్కడో ఇలాంటి ఒకరు ఉంటారు పనికిమాలిన కబుర్ల వాడవి అనుకున్నా సరే,వాడో మాటలు పుట్టా అనుకున్నా సరే మనసుకు చాలా పనికొచ్చేవాడు
నీకు నాకు ఎక్కడో ఒకచోట ఇలాంటి ఒకరు ఉండే ఉంటారు. ఎదురయ్యే ఉంటారు, కరకు మాటలతో తరిమే ఉంటాము. ఉన్నప్పుడు విలువే ఉండదు పోయాక తెచ్చుకోవడానికి మరొకరు దొరకరు.
ఇంతకూ ... ఇలాంటి ఒకరు ఉన్నారా
ఉంటే ఎంత అదృష్టవంతులో...