అబద్దమాడుతున్నానేమో....
ప్రేమించడం అంటే
తెలియని ఒక లోయ అంచు కదా
నిన్ను చూశాక
మరింత మృదువుగా ప్రేమించాలనిపిస్తుంది
మరింత స్పష్టంగా ప్రేమ భావన పలికితే బాగుండనిపిస్తుంది...
ప్రేమ ఎంతో బాగుంటుంది
కొత్త కొత్తగా నేర్చుకుంటుంటే మరిమరి బాగుంటుంది కదా
మరి ఎందుకో... ఇపుడు
ప్రేమలో నిను బంధించాలని
మాట వరసకైనా ఆశపడడం తప్పనిపిస్తోంది
వెనుక తిరిగి చూడమని అడగడం కష్టంగా ఉంది
స్వేచ్ఛనేదో హరిస్తున్నట్టు మనసు కలతగా ఉంది
ఓసారి ఇటు రారాదు అనడానికి జంకుగా ఉంది
తెలియని గుబులేదో నా చుట్టూ అల్లుకున్నట్టుంది
ఆకాశమంత ప్రేమిస్తున్నానని అబద్దమాడుతున్నానేమో...
ఓయ్
బహుశా......
నాకు ప్రేమించడం ఇంకా అంత బాగా రాదనుకుంటా