అతను అంటాడు
లోకమంతా ఒక్కటై
నిన్ను వెలివేస్తుంటే
యేం చేస్తావ్ వంటూ
హా....ఏం చేస్తాను
రెండు చేతులు మొహంపై కప్పుకొని
నా కళ్ళను చీకటి గుహలోకి వదిలేస్తాను
ఆ చూపులు వెతుకుతూ
అనంతదూరానికి పయనిస్తాయి
ఆ చివర ఎక్కడో సముద్రమంత
కుప్ప పోసిన కలలు ఎదురు చూస్తుంటాయి
అక్కడినుండి
రాలిపోయిన క్షణాల్ని తెచ్చుకోగలను
విడిచి వెళ్లిన ఆశలను మూటకట్టగలను
ఏదైనా చేయగలననే
కొండంత నమ్మకాన్ని మూటకట్టుకు వచ్చిన
కళ్ళంటే ఇపుడు నాకెంత ఇష్టమో...
ఓయ్
ఆ కళ్ళలో ఉన్న నీవంటే కూడా