ప్రేమే కదా

నువ్వు నేను ఎప్పుడో విడిపోయి
కలిసి ఉన్నట్టు కలకంటున్నానా

నా నుంచి
నువ్వు విడిపోయావా
నేను తప్పుకున్నానా

విడిపోవడం అంటే
ఎదురుపడకపోవడమా
ఎదురుచూడకపోవడమా

కాదేమో
ఎదురుచూపుకు
నువ్వు అందకపోవడము
నీకై నేను ఎక్కడో ఆగిపోవడము కదా

అయినా  .. ఇదేంటో
ఎదురుచూపు తరగక
అలవికానంత పెరుగుతుంది ...
మరింత ప్రేమించాలని ఆశ
కొత్తదారులు వెతుకుతూనే ఉంది

ఇంతకూ
మనము విడివడి ఉన్నట్టా
విడిపోయినట్టా....

ఓయ్
కొత్త లెక్కలు చెప్పి
కాస్త ఒప్పించి పోరాదు...
నువ్వంటే ప్రేమే కదా


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!