ఏం చేస్తావ్ ...
ఇక ఏమి చేయక్కరలేదు
మాట వరసకు కూడా ఓ మాట పలకొద్దు
దారి తప్పి ఇటు వైపు రానే వద్దు
నలుగురి మధ్యనున్నట్టు ఆనవాళ్లు పంపు
అనురాగపు మనుషులు బంధించారని చెప్పు
నాకోసం సమయం లేదని సందేశం పంపు
కరుకైన మాటలు నాలుగు విసురు
నా నుంచి చాలా కాస్త దూరంగా జరుగు
మనసుని కొన్ని ముక్కలుగా విరుచు
ఓయ్
నువ్వు పూర్తిగా అపరిచితుడివి అయిపో
నేను మరికొంత ఘాడంగా ప్రేమించడం నేర్చుకుంటాను
ఈసారి
మరింత కుదురుగా కథ మొదలెడతాను