ఓ ఉదయం
నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను
నువ్వు ఆకాశాన్ని
రెక్కలుగా చేసుకుని వెళ్ళిపోతుంటావు
రంగు రంగుల రెక్కలను కన్నార్పకుండా చూస్తాను
విరిగి రాలిన ముక్కను భద్రంగా దాచుకుంటాను
దాచబడినవి లెక్కలేనన్ని
ఇపుడిక్కడ ఆకాశమే
ఓయ్
మరో ఆకాశం వేచి ఉంది
ఈసారి...
ఇటువైపుకు వస్తావు కదా