అయినా
నేను నిశ్శబ్దంలో ఒదిగిపోలేదు
ఏ జ్ఞాపకమూ
ద్వేషంతోనూ ప్రేమతోనూ
నన్ను అల్లకల్లోలం చేయడం లేదు
నదీ ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చున్నట్టు
తీరం తాకే అలలను ఏనాటి నుండో చూస్తున్నట్టు
జరుగుతున్న తంతు ఎప్పటినుండో తెలిసినట్టు
జరిగిన కథనే మరోసారి చదివినట్టుంది...
అసలు ఏమైందని...
ఇద్దరి మధ్యన
కాసింత దూరం కుసింత విరామం ఎక్కువే
ఇప్పుడు
మరికొంత జోడింపబడింది...