ఎన్నిసార్లు చెప్పాను
పలకరింపులు మౌనంతో ముడివేయొద్దని...
మోహపురాగాలు ఆలపిస్తున్నానని
మంచిదానిని అనుకునేవు
మంకుపట్టుతో సమయం లేదని
పెంకి వేషాలు వేయకు...
ఓయ్
చేతిగోళ్ళు చూశావుగా
ఈసారి
బుగ్గ మీద గాటుపడితే
తప్పు నాది కాదు మరి...