ఆకాశపు దుప్పటి...

నువ్వు రాకుంటేనేమిలే
వంటలో చారడు ఉప్పేసే మతిమరుపూ
నలుగురిలో మాట రాని మూగతనమూ
విషాద గీతాలు ఆలాపన
ఏదీ లేదు ... అంతా మామూలుగానే ఉంది

పొద్దున ఫిల్టర్ కాఫీ ...రాత్రి నిండుగా భోజనం
కంటి నిండా నిద్ర అంతా మామూలుగానే ఉంది

ఓయ్
ఇప్పటివరకు చెప్పిందంతా నిజమే
కానీ
నువ్వు వస్తే
దూదిపింజమై గాలిలో తేలుతాను
చుక్కలను ముద్దాడి ఆకాశపు దుప్పటి కప్పుకుంటాను...
ఓహ్.. నేనో అపురూపాన్ని అయిపోతాను

రారాదూ... ఇటువైపు ఓసారి
మనసుపడి మరింత దగ్గరకు
ఆకాశపు దుప్పటి కప్పుకోవాలని ఉంది..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!