నేనేమీ మంచిదాన్ని కాదు
కావాల్సినంత మొండితనం
కాదనుకున్నా వదలని పెంకితనం ఉంది
అడిగానని అలక పూనానని
పనిగట్టుకు వచ్చేవు ...
పని వదిలేసి వచ్చావని
ఆరడి పెట్టే పేచీకోరును
నువ్వేమీ చెప్పకు
నీ నుంచి దూరంగా వెళ్లమని...
మాట పట్టింపు ఒడిసిపట్టి
మాట వినేదాన్ని కాదు
వెతికి వెతికి నీ చుట్టూ
దడికట్టే మంకుతనం పిల్లను...
నా ప్రేమ సాక్షిగా నిజం చెబుతున్నా
నేనేమీ మంచిదాన్ని కాదు
ఓయ్
మళ్లీ మళ్లీ చెబుతున్నా
నన్ను కలలో కూడా ప్రేమించకు
నేను ఏమాత్రం మంచిదాన్ని కాదు
మరీ మరీ చెపుతున్నా నన్ను ప్రేమించకు...