భయపడ్డాను ... అయినా ఒప్పుకోను

భయపడ్డాను
అవును భయపడ్డాను ... అయినా ఒప్పుకోను

అర్ధరాత్రి అనుకోని కల వచ్చిందని భయపడ్డాను
తెలిసిన వారు ఎవరో కనిపించలేదని భయపడ్డాను
నా నుండి నేను వేరు పడుతున్నానని భయపడ్డాను
నీవు రాలేదని రావేమోనని భయపడ్డాను

అయినా
భయపడ్డాననే నిజాన్ని అసలే ఒప్పుకోను

నేను భయపడడం నిజమే
నువ్వంటే ఎంత ఇష్టమో అంతటి నిజం
అయినా...

ఓయ్
ఏది ఒప్పుకోను ఎందుకనో ఒప్పుకోను
ఇక
భయపడ్డాను అన్నది ఎప్పటికీ ఒప్పుకోను


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!