ఇంకా నేర్చుకోలేదోయ్

అతను క్షణం క్షణం గుర్తుకు వస్తాడు
అతని మాట కోసం ఎదురు చూస్తాను

ఎన్ని వేల క్షణాలో కదిలిపోతుంటాయి
అతని నుంచి ఒక్కమాట రాదు
అయినా పదే పదే  విసిగించను

ఎప్పుడైనా ఆదమరిచి పలకరిస్తే
వేచి చూసిన వేల క్షణాలు గుర్తుకు వచ్చి
కన్నీటి వర్షం కురుస్తుందనుకుంటాను
ఒక్క పలుకు .. రాలదనుకుంటాను
ఉక్రోషంతో తప్పుకు పోతాననుకుంటాను.

నిజంగా...ఇవేమీ జరగవు
అతను హాయ్ అని అనగానే
ఇప్పుడే  పరిచయమైనట్టు...
గడిచిన క్షణమేది గుర్తులేనట్టు
నిండుగా కబుర్లు పోగేసుకుంటాను

ఓయ్
నీకై బెంగటిల్ల లేదని అనుకునేవు

ఏం చేయను ....
మనసు బెంగ నీ వరకు చేర్చడం
ఇంకా నేర్చుకోలేదోయ్


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!