అతనొక సామ్రాజ్యాధినేత
తెలియని రాజ్యానికి రాజు మరి
అతని కోసం కొన్ని దారులు
కొందరు మనుషుల్ని అమర్చుకున్నాడేమో
అందుకే......
నా దారిన ఎదురుపడనప్పుడు
నా మాటకు మారు పలకనప్పుడు
నా చిరునవ్వుకు కారణంగా నిలవనప్పుడు
నాకెందుకో అనిపిస్తుంది
అతనికి నేను అక్కరలేదేమో అని...
అయినా
గత యుగములో నేర్చుకున్న మంత్ర విద్య
ఈ కాలంలో నేర్చుకున్న గారడీ విద్య
కొత్తగా నేర్చుకుంటున్న తంత్రవిద్య
అక్కరకు రాకుండా పోతాయా.....
ఓయ్
నేనేమనుకున్నా ...
నీవేమనుకున్నా ...
నా నుంచి తప్పుకుపోయే దారి
కనుమరుగు చేయడం
నాకు వెన్నతో పెట్టిన విద్యనే కదోయ్