వెన్నెల దుప్పటి కప్పుకుందాం - ఇషాక్ హుస్సేన్

అందమైన ముఖచిత్రంతో
అపురూపమైన భావాలతో
అద్భుత కవితాపదజాలంతో...

అతను నేను
బొమ్మ బొరుసు
ఇప్పటికీ అర్థం కానిది ఒకటే
నాణేనికి ఒకే వైపు ఎలా ఉన్నాం అంటూ...
ఆశ్చర్యపరిచే  భావాక్షర విన్యాసాలతో
వెన్నెల దుప్పటి నేసి
ఆకాశపు హద్దులు చేరుపుతూఎంతైనా ప్రేమించవచ్చు ప్రేమకు కొలమానాలు తూనీకలు లేవని ప్రేమ అజరామరం ప్రేమించబడడం కంటే ప్రేమించడమే గొప్పంటు
విస్తారమైన ప్రేమ కవిత్వం అందించిన కవయిత్రి రమాదేవి గారు

ప్రేమలో తను కోల్పోకుండా తనను ప్రేమించే అతని కోసం పదేపదే ప్రేమను ప్రకటిస్తూనే ఉంటుంది
గత ఏడు జన్మలుగా నీ వెంట నీడలా ఉన్నది నేనేనంటూ
తన అరచేతి గీతల మధ్య ఉన్న పుట్టుమచ్చ సాక్షిగా అతని ప్రేమ కోసం తనలోతాను ఇంకిపోతూ
అప్పుడప్పుడు అలుగుతు అతని కోసం ఎదురు చూస్తూ
అతను నడిచిన దారులన్నీ వెతుక్కుంటూ కలయిక కుదరని కాలాన 
నేను వచ్చిన వేళ మించిపోయిందేమోనని వాపోతూ ...
నిదుర రాని కలలా తన మాటలతో తనే సేద తీరుతూ...
ఎందుకో ఆ వైపున అతనే ఉన్నాడన్న ఊహతో అలవికాని  మోహపు కాంతులను చుట్టేసుకొని
తనను తాను కొత్తగా అణువణువు అరుదైన శిల్పంగా చెక్కేసుకుంటూ
అతని జ్ఞాపకాలతోడుగా ఎన్నెఎన్నో ఆశలతో
నీవు నా మోహపు రంగుల నక్షత్రం అంటూ  ...
బందీ చేసుకుందామన్న ఊహలు మొదలవగానే అతని స్వేచ్ఛ కై మది తిరుగుబాటు చేసిందంటూ స్వతంత్రాన్ని ప్రకటిస్తుంది...
మరోచోట ప్రేమలో తప్పేమీ లేదంటూ తనకు తాను కొన్ని మాటలతో తృప్తి పడుతు
గత జన్మలో చేసిన పాపాన్ని మరిచినట్టు
పెట్టిన ఒట్టు పంపిన లేఖ ఆనవాళ్లు చెరిపేసానంటూ
ప్రేమ మాయ లో అతనిచిత్రాలను గీస్తూ మొహపు గీతాలు ఆలపిస్తూ వెన్నెల దుప్పటి కప్పుకుందాం అంటూ అతన్ని ఆహ్వానిస్తూ ఉంటుంది__
మృదుమధరంగా కడురమణియంగాపుస్తకం నిండా ప్రేమ కవిత్వం వొంపి
ఎంతో అభిమానంతో స్నేహపూర్వకంగా సోదరి
శ్రీ రమాదేవి గారు పంపిన వెన్నెల దుప్పటి కప్పుకుందాం అనే కవితా సంకలనం
నేడు నా చేతికందినది వారికి నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు
దిల్ సే శుక్రియ సలాంలు..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!