రవిచంద్ర - అంతర్వాహిని

తెలుగు వెబ్ సైట్ లు వెతుకుతుంటే ఇదిగో ఇలా ఒక బ్లాగ్ కనిపించింది. పేరు బాగుంది కదా అని చూడడం మొదలెట్టాను. ఆ బ్లాగ్ పెట్టి 2 సంవత్సరాలు అయిందేమో, చూసేవాళ్ళు చాలానే ఉన్దోచు, ఆ బ్లాగ్ గురించి తెలిసిన వాళ్ళు ఉండవచ్చు, నేనే చూడడమే ఆలస్యంగా చూసానేమో.... బ్లాగ్ పేరు బాగుంది, అందులో కథలు,స్ఫూర్తి, ఆధ్యాత్మికం, హాస్యం,రాజకీయాలు, ఇలా అన్ని ఉన్నాయ్..అన్ని బ్లాగ్స్ లో ఇలా ఉండడం సహజమే కావొచ్చు. అక్కడ ఉన్న కథలు, మధురఘట్టాలు చదివి ఇతను రచయిత అనుకున్నా, ఇతని పుస్తకాలూ ,రచనలు ఎవైన ఉన్నాయేమో అని 'నా గురించి' అని ఉన్న దాన్ని క్లిక్ చేశా...అందులో యిలా ఉంది...

"నా పేరు ఇనగంటి రవిచంద్ర, మా ఊరు శ్రీకాళహస్తి. కంప్యూటర్లలో తెలుగు అంటే చాలా ఆసక్తి. అదే నన్ను మొదటగా తెలుగు వికీపీడియాలో పాల్గొనేలా ప్రోత్సహించింది. అక్కడ నేను నిర్వాహకుణ్ణి కూడా, వీలుంటే మీరు కూడా ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకోండి".

నాలో ఒకింత ఆశక్తి ని కలిగించింది రవిచంద్ర బ్లాగ్ అంతర్వాహిని ....ఇతను ఏమి ఉద్యోగం చేస్తుంటాడు ...యిలా చేయాలంటే టైం ఎలా సరిపోతుంది అని అనిపించింది, బ్లాగ్ చేయడమే కాకుండా వికిపిడియాలో పాల్గొంటున్నాడు అంటే, ఎంత ఓపిక ఉండాలి అనుకున్నా, అపుడు అతని గురించి తెలుసుకోవాలని అతని బ్లాగ్ మరియు అతని చేసే వర్క్, తెలుగు వికీపీడియాలో రవిచంద్రగారి పేజి చూడడం మొదలుపెట్టాను.


రవిచంద్ర వికిపిడియాలో చెప్పిన " నా గురించి"
నా పేరు ఇనగంటి రవిచంద్ర. మా స్వగ్రామం శ్రీకాళహస్తి పక్కన చేమూరు అనే చిన్న పల్లెటూరు. నా బాల్యంలో చాలా భాగం మా అమ్మమ్మ గారి ఊరైన ముచ్చివోలు లో గడిచింది. నా పై చదువుల కోసం ఆ గ్రామాన్ని వదలడం నన్ను ఇప్పటికీ భాధిస్తుంటుంది. తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ రీత్యా ఎప్పుడూ ఆంగ్ల భాష తో కుస్తీ పడే నాకు నా మాతృ భాష ఋణం తీర్చుకోవడానికి నాకు ఇంతకంటే మంచి మార్గం తోచలేదు. ప్రస్తుతం హైదరాబాదు ఒరాకిల్ లో అసోసియేట్ అప్లికేషన్స్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. స్వతహాగా సాంప్రదాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కనుక గ్రామాలన్నా, అక్కడి ప్రజలు, వారు కనబరిచే ఆత్మీయత, అక్కడి ప్రశాంత జీవనం, పచ్చటి పొలాలు, చెట్లు, సెలయేళ్ళు, ఈత బావులు మొదలైనవంటే ఎంతో ఇష్టం..

రవిచంద్ర నినాదాలు..
రోజుకో మొలకను పట్టు... తెవికీ విజయానికిదే తొలిమెట్టు
వికీపీడీయాను విస్తరించు... విజ్ఞాన విరులను పూయించు

రవిచంద్ర..తెలుగు మెడల్..
తన విశేష ప్రతిభతో అనేక రంగాల్లో తెవికీ అభివృద్ధి కొరకు కృషిచేసిన రవిచంద్ర గారికి, తెవికీ సభ్యుల తరఫున అహ్మద్ నిసార్ సమర్పిస్తున్న చిరుకానుక తెలుగు మెడల్..

వికీపీడీయాలో సాధారణంగా రవిచంద్రగారు చేసే పనులు
  • కొత్తగా తెలుగు వికీపీడియాలో చేరిన సభ్యులకు సాధ్యమైనంత త్వరగా స్వాగత సందేశాన్ని అందించడం.
  • చిట్కాలు రాయడం.
  • కొత్త సభ్యులకు సహాయం చెయ్యడం.
  • మొదటి పేజీలో మీకు తెలుసా! వాక్యాలను మార్చడం.
  • చిన్న వ్యాసాలను విస్తరించి తెలుగు వికీ నాణ్యతను పెంచడం.
  • సాధ్యమైనంతవరకు ఎక్కువమంది చదువరులకు ఆసక్తిగల కొత్త వ్యాసాలను ప్రారంభించడం.

వికీపీడియా గురించి
ప్రతి ఒక్కరికీ చేరువలో స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం అనే నినాదంతో ప్రారంభమైన వికీపీడియా ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడుతున్న తొలి పది వెబ్‌సైట్లలో ఒకటి. దీన్ని అభివృద్ధి చేయడం లో ఎవరైనా పాల్గొనవచ్చు. వ్యాసాలను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, తటస్థ దృక్కోణంలో రాయాలి. ప్రస్తుతం వికీపీడీయాలో కొద్ది మంది సభ్యులు మాత్రమే క్రియాశీలకంగా పని చేస్తున్నారు. మీకు తెలిసిన వారికి వికీపీడియా గురించి పరిచయం చేసి తెవికీ విస్తృతినీ, వాసినీ పెంచండి.

రవిచంద్ర..కంప్యూటర్లో తెలుగు..
.తెలుగు అభివృద్ధి

కంప్యూటర్లలో తెలుగును చూడడానికి రాయడానికి అవసరమైన సాంకేతిక సహాయం, తెలుగు వికీపీడియా, తెలుగు బ్లాగుల గురించిన సంక్షిప్తమైన సరళమైన సమాచారం కోసం scribd ని పెట్టారు.ఇందులో మీకు కావలసిన సమాచారం అంతా ఉంటుంది.
ఇంకా కంప్యూటర్లలో తెలుగు అభివృద్ధి చెందాలంటే ఏమేం చేయాలో ఆలోచిస్తుంటారు . తెలుగులో సాఫ్ట్‌వేర్లు, వెబ్‌సైట్లు తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటారు . మీకు ఏదైనా ఆలోచనలుంటే నాతో పంచుకోండి. మీకు సహాయం అడిచడానికి ఎపుడూ నేను సిద్దంగా ఉంటాను అంటారు రవిచంద్ర. అంతర్జాలంలో తెలుగు కోసం ఇంకా రవిచంద్ర చేసే పనులు.వర్డ్‌ప్రెస్.కామ్ అనువాదాలు, వికీమీడియా అనువాదాలు, లాంచ్‌పాడ్ అనువాదాలు చేస్తారు.

ఎందుకు రాసాను....

ఇదంతా ఎందుకు రాసాను అంటే... ఏదో కథలు, కవితలు రాసుకుంటూ ఉన్న నాకు ఇంత ఆశక్తి కలిగించింది కదా! ఎంతో మంది ఉంటారు కాస్త సమయం ఉందండి ఏమి చేయాలో తెలీడం లేదు అనేవాళ్ళు , మాకు తెలుగు మాత్రమే తెలుసండి కొంచెం కూడా ఇంగ్లీష్ రాదు అని చిన్నబుచ్చుకునే వాళ్ళు ఉంటారు, మనకు తెలిసిన విషయం పదిమందికి చెప్పాలనుకునే వాళ్ళు ఉంటారు, తెలుగు కోసం ఏమైనా చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, సహాయం చేద్దాం అనుకునేవాళ్లు, అడగాలనుకునేవాళ్ళు ఉంటారు, ఇలాంటి ఏ ఒక్కరికైన ఉపయోగ పడకపోతుందా అన్నా ఆశ.. అంతే కాదండోయ్! పదిమంది చదివితే అందులో ఇద్దరికైన ఆశక్తి కలిగిస్తే అందులో ఒక్కరైన రవిచంద్రగారి బాటలో పయనించక పోతారా అన్నా అత్యాశ కూడా ఉందండి....

Comments

Post New Comment


SREEDHAR TUMULURI 26th May 2011 07:19:AM

nijamga chala chala informative ga undi.and ravichandra krushi ki,pattudalaki,aasayaniki,telugu bhasha meeda unna mamakaaraniki,istaniki,prema ki,sirasu vachi namaskaristunna.alage ilanti mani poosalanti vishayanni andariki panchina rama gariki kuda naa paadabhivandanam...