సముద్రపు లోలోతుల్లో
మరొకలోకం ఉంటుంది తెలుసా..
అప్పుడప్పుడు నా పక్కన చేరి
నాలుగు మాటలు చెప్తుంది మరి..
అదొక అలవి కానీ అద్భుతం
అందుకే మరి....
నిన్ను ఎంతైనా ప్రేమించొచ్చు...
ఒడిసిపట్టలేని నీ అనురాగంలా...
ఓ సముద్రం నా బుగ్గన దాక్కుందోయ్
అందుకే చిరునవ్వు చెరిగిపోవట్లేదు ...
- R.Ramadevi
ఆర్. రమాదేవి గారి కవిత్వం 'వెన్నెల దుప్పటి కప్పుకుందాం' కవితాసంపుటిగా ఇటీవలే వచ్చింది. ప్రేమ అనే ఉదాత్తభావన కేంద్రకంగా రాసుకున్న ఆమె కవితలు ఇవి. 'ప్రేమించడం అంటే నన్ను నేను కోల్పోవడం కాదు, నాతో అతనిని కూడా దాచుకోవడం. నేను తనతో లేకపోతే అతను లేనట్టే', 'ప్రేమ ఏం చేస్తుంది అనేది మదికి మాత్రమే అర్ధమయ్యే మాటలు' అనే అంతస్సూత్రం ఈ కవితల్లో అంతర్లీనంగా దాగిన దారం.
కవితల నడక, పదాల పొందిక ఆకట్టుకుంటాయి. 119 పేజీల పుస్తకం ఇది.
'ఒక్కసారి ప్రేమించి చూడు
నీవు నీవుగా ఉండి
ఆకాశమంత ప్రేమించు'
అనేది ఈ కవిత్వ సిలబస్.