"వెన్నెల దుప్పటి కప్పుకుందాం "
మనసంతా నీవున్నపుడు
నాకంటూ నేను ఎక్కడ??
అంటూ....
ఆరాధనలో ఆద్యంతం
ఉండినపుడు,
అంతరంగం అంతా
అతడే నిండినపుడు,
"వెన్నెల దుప్పటి కప్పుకుందాం"
వేయి ఊసులు చెప్పుకుందాం అంటూ....
చల్లని చిరుగాలి
చెక్కిలిపై వాలి
చెరగని గంధాల్ని
చేర్చినట్లు.....
అతని స్మృతిలో
అపురూప మైత్రి సుమాలుగా
విరిసినట్లు....
రచించిన
ఒక్కో కవిత
ఒక్కో పరిమళాన్ని
అదే పరవశాన్ని మనసంతా నింపింది.
ఒక్కో కవితను వేయి రీతుల
విశ్లేషించాలి,
అభినందించాలి,
అక్షరాక్షరాన్ని అభిషేకించాలి.
అంత అద్భుతంగా వ్రాసారు
శ్రీమతి రమాదేవి గారు.
ఇంత చక్కటి పుస్తకాన్ని
స్నేహంతో అంటూ నాకు
పంపిన మీ సహృదయతకు.
వినమ్ర నమస్సులు.