వెన్నెల దుప్పటి కప్పుకుందాం-దోరణాల విదురారెడ్డి

వెన్నెల..
మృదువైనది
చల్లనైనది
అందమైనది
హార్దమైనది
చీకటిని సున్నితంగా సాగనంపి
నిశీధి పొద్దులో హాయి వెలుగు నింపేది
మనసు రూపానికి
వెండి కళను ప్రతిష్టించేది

***** "వెన్నెల దుప్పటి కప్పుకుందాం" R. Rama Devi
అంతే సుందరమైనది "అతడు" వారి కవిత్వలో హృదయంతో ఆరాదించబడతాడు అపురూపమై విరాజిల్లుతాడు మోహనమై వేణువు ఊదుతాడు రాగమై పరవశిస్తాడు

ప్రతి కవిత ఆకాశమంత ప్రేమను అతడిపై కురిపిస్తుంది

అతడు ప్రేమ స్వీకారి మహా రాజసమై ఆమె మదిలో కొలువుండిపోతాడు

కవితలలోని ప్రతి వాక్యమూ రమాదేవి గారి సృజనాత్మక కవితా నైపుణ్యానికి తార్కాణమై నిలుస్తాయి

***** మహా రాజసమై ఆమె మదిలో కొలువుండిపోతాడు కవితలలోని ప్రతి వాక్యమూ రమాదేవి గారి సృజనాత్మక కవితా నైపుణ్యానికి తార్కాణమై నిలుస్తాయి

ఈ కవితలు చదివేటప్పుడు అతడు / ఆమె తప్పకుండా ఎదురుపడతారు ప్రేమామృత వర్షిణి అయిన ఈ కవితా సంపుటి ఓ సున్నితమైన ప్రేమాలయం

దోరణాల విదురారెడ్డి గారికి స్నేహంగా అంటూ ఈ పుస్తకంతో పాటు ఎంతో ఆత్మీయతతో

"చైనా జపాన్ ప్రసిద్ధ కథలు "అనే పుస్తకం కూడా పంపిన రమాదేవి గారికి హృదయపూర్వకముగా ధన్యవాదాలు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


 

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!