❤️❤️ వనజ గారి అపురూపమైన కానుక ❤️❤️
రమాదేవి గారి కవిత్వం చదవడానికి అలవాటు కాకపూర్వం కొంత అయోమయంగా వుంటుంది. చదవగా చదవగా లోతు తెలుస్తుంది. కంటికెదురుగా లేని అతనితో అసలు వున్నాడో లేదో తెలియని అతనితో అతని గురించిన విశేషాలే చెబుతుంటుది ఆమె.
ఒక్కో కవిత తేటతెల్లంగా హృద్యంగా వుంటుంది. ఒకసారి ఆమె కవిత్వం చదవకూడదు కొన్నాళ్ళు అని ఒట్టు పెట్టుకున్నా. ఎక్కడైనా ఆమె లా రాస్తానని. మరి రాసే కథ కూడా ప్రేమ కథ.
కాసేపు ఆమె కవిత్వాన్ని చదవడం ఆపి దృశ్యం ఊహించుకుంటా. నాకు మొత్తంగా కాకపోయినా.. ఈ అనుభూతి కవిత్వం నచ్చుతుంది. కవర్ పేజీ టైటిల్ చాలా బాగున్నాయి. కవిత్వం సందేశమో సామాజిక చైతన్యం కోసమో రాయనవసరంలేదు. ఇలా కూడా రాయవచ్చు అని రమాదేవి గారూ రాసుకుని చూపించారు.
కవిత్వంలో ఏముంటుంది ప్రేమ అనే ఊహ, దూరం ఎంతైనా, భౌతిక రూపం వున్నా లేకున్నా, భావన లోనే బలం వుంది. అది మనసుకు శాంతి నెమ్మళం కల్గిస్తుంది. ఇది చాలు కదా.. అనుకున్నాను మరి.
అందుకే రమాదేవి గారి కవిత్వానికి హృదయపూర్వక స్వాగతం. ఏ ఏటి వొడ్డునో.. కూర్చుని హాయిగా చదువుకోవడానికి చేతిసంచీలో వుంచుకుంటాను....వెన్నెల దుప్పటి కప్పుకుందాం
అభినందనలు రమ గారూ