ఖాళీ ఈ పదానికి ఎంత విలువనో...
ఈ పదం విడిగా విన్నప్పుడు ఇందులో వేదన విరహం పోగొట్టుకున్నతనం అన్ని అనిపిస్తూ ఉండేవి..
ఖాళీ అంటే పూర్తిగా వదిలేసుకున్నది.. అక్కడ ఏమీ లేని శూన్యం కానీ ఏమీ లేదు అన్న చోటనే ఏదో ఉంది ..అవును ఖాళీ పూర్తిగా వదిలి వేయబడనిది ..మనసు నుండి పూర్తిగా చెలిపివేయని గురుతులు
ఖాళీ ఆ చోటు నుండి ఎంతో దూరంలో ఉన్నా.. ఆ చోటికి ఎప్పుడూ తిరిగి వెళ్ళలేకపోయినా కూడా.. అప్పుడు.. ఇప్పుడు అనకుండా కాలం వడిలో మన మనసుకి కొన్ని సుగందాలను నీకు తెలియకుండానే మనసు నిండుగా నింపి వెళుతుంది...
అక్కడక్కడ వదిలేసుకున్న కొన్ని ఖాళీలను భర్తీ చేసే పనిలో ఉన్నాను ఇపుడు...