ఏమోయ్..... ఓ మాట
మా ఊరి ఈత చెరువు గట్టు కింద రాలే పారిజాతాలను ఏరుకుంటూ నీ అడుగుల ఆనవాలు వెతుకుతున్నా... అవి చెరిగిపోకుండా నా అడుగులు కలుపుడామని...
ఎక్కడ నువ్వు... ఎక్కడ మా ఊరు.. ఏమో నీ జ్ఞాపకాలు గాలివాటుకు ఇటు కొట్టుకొచ్చాయేమో.. జ్ఞాపకాలు వచ్చిన చోటికి నీవు రాకూడదని లేదు కదా.....నీ అడుగుల సవ్వడి ఇటువైపుగా విన్నానని... నా మది చెప్పింది మరి
అయినా నాకు నీకు రుజువులతో పని ఏముంది....
నా మరి ఊహలతో ఆశలతో కథలల్లుతుంది.... ఆ కథలకు ప్రాణం పోయడం నీకు తెలిసిన విద్యయే కదా... ఆకాశం నిద్రపోయినప్పుడు మేల్కొన్నాను నీ కోసం నీకు తెలియని చోటులన్నీ వెతకాలని...
నిన్ను వెతికే ఆటలో నేను తప్పిపోలేదు కదా...