అక్కడ చిరపరిచితమైన నది పాట ఒకటి సన్నని స్వరాన పలుకుతుంది... నిశ్శబ్దంగా వెళ్లి తన చెంత కూర్చున్నాను.. ఇంత ఆలస్యంగా అయిందే అని అడిగింది... దారి తప్పిపోయానేమో.... అన్నాను లోగొంతుకతో.... నాతో ఉంటావా కళ్ళతోనే ప్రశ్నించింది... నేను వెనుదిరిగి చూస్తూ ...
తనతో అన్నాను ఉండిపోనా నెమ్మదిగా అడిగాను... చిరువవ్వు నవ్వి మరోమాట మాట్లాడకుండా నాకై తను రాగాలాపన చేసింది వేలవేల స్వరాలతో ..నా అణువణువు తనలో కరిగిపోయేట్టు... అలసి తన చెంత నిదురబోయేవరకు..
రాత్రి గడిచిపోయింది... మెల్లిగా తెల్లవారింది...అక్కడ అందరూ నది హోరు ఎక్కువైంది నిదురేలేదన్నారు...
నా కళ్ళు తడిబారాయి... మాటలేమీ లేవు ఇక..
నేను వీడ్కోలు చెప్పకుండానే వెనుదిరిగాను... తన స్వరగీతం తన ఆనవాలుగా నా మదిలో దాచింది...